60కోట్లకు చేరువలో 'గీత గోవిందం'

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం 'గీత గోవిందం' బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండిస్తోంది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కొల్లగొడుతోన్న వసూళ్లకు ట్రేడ్‌ పండితులు ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పటికి 55 కోట్లు షేర్‌ దాటింది. 60 కోట్ల షేర్‌కు దగ్గరవుతోంది. గ్రాస్‌ పరంగా ఇప్పటికి 100 కోట్లు దాటేసింది. కెరీర్‌లో తొలి సెంచరీ కొట్టానంటూ విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. దర్శక, నిర్మాతలకు, హీరోయిన్‌కు ఈ సక్సెస్‌ని అంకితమిస్తున్నాననీ విజయ్‌ దేవరకొండ చెప్పాడు. 

అలాగే తెలుగు అభిమానులకు, తమిళ అభిమానులకు, కన్నడ అభిమానులకు, మలయాళ అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. హీరోగా తొలి సినిమా 'పెళ్లిచూపులు'తో సెన్సేషనల్‌ విజయం అందుకున్న ఈ కుర్ర హీరో తన సక్సెస్‌ గ్రాఫ్‌ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్నాడు. 'అర్జున్‌రెడ్డి'తో రెండో సంచలనం, ముచ్చటగా మూడో సినిమా 'గీత గోవిందం' మరో సంచలనాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తదుపరి వరుస చిత్రాలను లైన్‌లో పెట్టేశాడు. 

ఇంతవరకూ సాధించిన విజయాల రేటుతో, విజయ్‌ దేవరకొండ నుండి రాబోయే తదుపరి చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS