సినిమా విడుదలకి ముందే సగం సినిమా లీక్ అయిపోవడం అనే వార్త ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఆ వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటంచిన గీత గోవిందం చిత్రం సగం భాగం లీక్ అవ్వడం జరిగింది. సంచలనం రేపిన ఈ ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్ధుల పాత్ర ఉందని తేలడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం- గీత గోవిందం ఎడిటింగ్ టీంకి చెందిన ఒక వ్యక్తి నుండి ఈ సినిమా ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి కి వెళ్ళడం అక్కడి నుండి తన తోటి విద్యార్ధులకి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కల ద్వారా ఈ చిత్రం లీక్ అయిపొయింది.
ఈ విషయం తెలిసిన వెంటనే గీత గోవిందం టీం టాస్క్ ఫోర్సు పోలీసులని ఆశ్రయించగా వారు వెంటనే విచారణ చేపట్టి ఒక ఇద్దరు విద్యార్ధులని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తున్నది.
ఏదేమైనా ఇటువంటి లీక్ వ్యవహారాల్లో విద్యార్ధుల పాత్ర ఉండడం శోచనీయం.