నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో వ్యాఖ్యాత నాని మరోసారి ఇంటిలోని సభ్యులకి తనదైన శైలిలో క్లాసు పీకడం మనం చూసాము. ముఖ్యంగా నాని-తనీష్ ల మధ్య జరిగిన సంబాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
కెప్టెన్సీ టాస్క్ కోసం బెస్ట్ ప్లేయర్ గా తనని తాను ఎలా సమర్ధించుకున్నాడు అన్న అంశంలో తనీష్ వ్యవహరించిన తీరుని అదే సమయంలో టాస్క్ లో కూడా రెండు భిన్నమైన అభిప్రాయలు చెప్పినదాన్ని నాని హైలైట్ చేశాడు. ఇలా సేఫ్ గేమ్ ఆడటం సరికాదు అని కాస్త గట్టిగానే చురకలు అంటించాడు.
అయితే బయట తనకి ఎంతగానో నాని సహాయం చేశాడు అని తన లైఫ్ లో నానికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను అని షో లోనే చెప్పడం. దానికి నాని స్పందిస్తూ- నీకు నా సహాయం ఎప్పుడు ఉంటుంది కాని అది బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కాదు అని చెప్పాడు.
నిన్న దానికి తగట్టుగానే తనీష్ చేసిన పనిని తప్పుపడుతూ నాని వ్యవహరించిన తీరుకి అందరు ఫ్యాన్స్ అయిపోయారు.