'లేదు మేడమ్.. నేను మారిపోయాను. పూర్తిగా మారిపోయాను..' అంటున్నాడు విజయ్ దేవరకొండ. అసలింతకీ విజయ్ దేవరకొండ మారిపోవడమేంటీ అనుకుంటున్నారా? ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గీతా గోవిందం' లోనిదీ డైలాగ్ అంతే. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ దర్శకుడు. బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లోనిదే డైలాగ్. 'ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు' అంటూ తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను..' అని రష్మిక ఇచ్చిన వార్నింగ్ డైలాగ్‌కి విజయ్ చెబుతున్న ఆన్సరే ఇది. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలే యూత్‌లో భలే క్రేజ్ సంపాదించేశాడు విజయ్ దేవరకొండ. ఈ టీజర్ కూడా అందుకు తగ్గట్లుగానే ఉండడంతో యూత్‌కి కనెక్ట్ అయిపోతోంది. విజయ్‌తో పాటు, 'ఛలో' సినిమాతో రష్మిక కూడా యూత్ ఐకాన్ అయిపోయింది. సో ఈ జంట కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఇంకెలా ఉండబోతోందో.
టీజర్‌లో బ్లాక్ అండ్ వైట్ కాలంలో విజయ్, రష్మిక భార్యా భర్తలుగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించిన తీరు బాగా చూపించారు. అయితే ఇదంతా విజయ్ దేవరకొండ ధియేటర్‌లో కూర్చుని కల గంటాడు. ఈ అందమైన కలతోనే టీజర్ ప్రారంభమవుతుంది. మొత్తానికి టీజర్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.