ఇటీవలి కాలంలో బుల్లితెరపై హల్‌చల్ చేసిన సూపర్ హిట్ సినిమాల్లో 'రంగస్థలం' ముందుంటుంది. ఆ తర్వాతి స్థానం 'భరత్ అనే నేను' సినిమాది. ఈ రెండు సినిమాలూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో వుండడంతో, బుల్లితెరపై వీక్షకుల్ని అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ, 'గీత గోవిందం' విషయంలో అలా జరగలేదు. 'గీత గోవిందం' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కన్పించలేదు. థియేటర్లలో అలరించి, బుల్లితెరపైకొచ్చింది. దాంతో, బుల్లితెరపై 'గీత గోవిందం' సినిమాకి 20.8 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇటీవలి కాలంలో ఏ తెలుగు సినిమా కూడా ఇంత పెద్ద యెత్తున టీఆర్‌పీ రేటింగ్‌ని దక్కించుకోలేకపోయిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. 'ట్యాక్సీవాలా' రిలీజ్‌కి ముందు విజయ్ దేవరకొండకి బుల్లితెరపై 'గీత గోవిందం' టీఆర్‌పి రేటింగ్ బయటకు రావడం పెద్ద ఊరట.
'నోటా' సినిమాతో డీలాపడ్డ ఈ యంగ్ హీరో, 'ట్యాక్సీవాలా'గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. మామూలుగా సినిమాలు శుక్రవారం వస్తుంటాయి. అరుదుగా గురువారం కూడా రావొచ్చు. శనివారం రిలీజ్ అంటే చాలా చాలా అరుదు అని చెప్పక తప్పదు. అయినాగానీ, 'ట్యాక్సీవాలా' సినిమా తనకు మంచి విజయాన్నిస్తుందని విజయ్ దేవరకొండ గట్టి నమ్మకంతో వున్నాడు.
విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ 'ట్యాక్సీవాలా' సినిమాలో నటించిన సంగతి తెల్సిందే.