విజయ్ దేవరకొండ తన గీత గోవిందం చిత్రంలో స్వయంగా పాడిన ఒక పాట నిన్న విడుదలైంది. ఆ పాట విడుదల చేసిన కొద్దిసేపటికే ఆ పాట ఏమాత్రం కూడా బాగాలేదు అని నెటిజెన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇక దీనికి తోడుగా సదరు పాటలో సీతా, సావిత్రి ల పేర్లని అభ్యంతరకర రీతిలో ఉపయోగించడం జరిగిందని అవి తమ మనోభావాలని కించపరిచేలా ఉన్నాయంటూ కొందరు ఈ పాట పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలే పాట ఆడియన్స్ కి నచ్చలేదు అని బాధపడుతున్న చిత్ర యూనిట్ కి ఈ అభ్యంతారాలు మరింత తలనొప్పిగా మారిపోయాయి.
వెంటనే ఈ అభ్యంతరకర పదాలని తొలిగించాలనే ఉద్దేశ్యంతో సదరు పాటని యుట్యూబ్ నుండి తీసేశారు దర్శక నిర్మాతలు. ఇక దీనికి సంబంధించి ఈ పాటలో ఉన్న పదాల వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారికి క్షమాపణ చెబుతూ వాటిని సరి చేసి మరోసారి పాటని విడుదల చేస్తామంటూ ఆ పాట రాసిన శ్రీమణి ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు.
దీనితో ఆ పాటలో కొత్త పంక్తులని జతపరిచి త్వరలోనే విడుదల చేయనున్నారు.