పూజా ఫలం అందుకుందా.?

మరిన్ని వార్తలు

కెరీర్‌లో సరైన హిట్‌ ఒక్కటి కూడా లేకపోయినా, క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా సెటిలైపోయింది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'అరవింద సమేత..' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనకున్న క్రేజ్‌తో వరుసగా స్టార్‌ హీరోలందరి సరసన నటించే బంపర్‌ ఛాన్స్‌ అయితే దక్కించేసుకుంది. 

కానీ హిట్స్‌ సంగతేంటంటా.? అంటే డైలమాలో పడేసే క్వశ్చన్‌ ఇది. 'డీజె' సినిమాతో మొదలు పెట్టిన ఆమె స్టార్‌ హీరోల ప్రయాణం ఇప్పుడు ఎన్టీఆర్‌ దాకా వచ్చి ఆగింది. ఈ సినిమాలో పూజా హెగ్దే టైటిల్‌ రోల్‌ పోషించింది. అయితే టైటిల్‌లో ఉన్న ఇంపార్టెన్స్‌ సినిమాలో ఆమె పాత్రకు అంతగా దక్కలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చాక. అయినా కానీ ప్రస్తుతానికి ఈ సినిమా మేనియా సాగుతోంది కాబట్టి ఆమె పాత్ర గురించి కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. 

ఈ దసరా సీజన్‌ని క్యాష్‌ చేసుకుని ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ లిస్ట్‌లో నిలిచిందంటే పూజాకి పండగే. అలా కాకున్నా ఆమె క్రేజ్‌కి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. త్వరలోనే మహేష్‌తో 'మహర్షి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరిస్తుంది. ఈ ఛాన్స్‌ మిస్‌ ఆయ్యే ఛాన్సే లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'భరత్‌ అనే నేను' బ్లాక్‌ బస్టర్‌ తర్వాత మహేష్‌బాబు నుండి వస్తున్న సినిమా భారీ అంచనాల సినిమా ఇది. 

సో ఇది కూడా పూజాకి హిట్‌ ఇచ్చే మూవీగానే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ప్రబాస్‌తో 'జిల్‌' ఫేం రాధాకృష్ణతో పూజా నటించే సినిమాపైనా అంచనాలు బాగానే ఉంటాయి. సో సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో అస్సలు సంబంధమే లేదు పూజా హెగ్దే కెరీర్‌కిప్పుడు. అదృష్టం అనేది ఈ రకంగా కూడా కలిసొస్తుందా.! అంటే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పూజాహెగ్దేనే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS