'ప్రేమకథ'తో హీరోగా పరిచయమైన అక్కినేని మేనల్లుడు సుమంత్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకానొక టైమ్‌లో సినిమాలకు బైబై చెప్పేసి నిర్మాతగా ఫిక్స్ అవ్వాలనుకున్నాడు. చివరి ప్రయత్నం అంటూ వచ్చి మళ్లీ హీరోగా ఫిక్సయ్యాడు. 'మళ్లీ రావా' అంటూ క్యూట్ లవ్ స్టోరీతో టచ్ చేశాడు. ఆ టచ్చింగ్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో మళ్లీ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు. కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ రూపొందించిన 'కావలుడారి' సినిమాని తెలుగులో 'కపటధారి' అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. స్ట్రాంగ్ కాన్సెప్ట్ కావడంతో, సుమంత్ వదలలేకపోయాడు. ఈ మధ్య ఈ తరహా థ్రిల్లర్ మూవీస్ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అలా 'మళ్లీ రావా'లా మరోసారి సుమంత్‌కి టైమ్ కలిసొస్తే, ఈ 'కపటధారి' మరో హిట్ అవుతుంది. ఈ సినిమాలో నందితా శ్వేత, పూజా కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్‌గా టైటిల్‌తో పాటు పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అకట్టుకుంటోంది.
టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తిగొలుపుతోంది. ఏమో చెప్పలేం, సుమంత్‌కి 'కపటధారి' కలిసొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకి దర్శకుడు. డా.ధనుంజయ్ నిర్మిస్తున్నారు. నాజర్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.