రాహుల్‌ - పున్నూ సెట్‌ అయిపోయారుగా.!

మరిన్ని వార్తలు

16 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్‌ అయిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3కి అంత స్థాయిలో పాపులారిటీ దక్కడానికి కారణం రాహుల్‌ సిప్లిగంజ్‌, పునర్నవి భూపాళం. బెస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంత కాలం ప్రేక్షకుల్లో సరికొత్త క్యూరియాసిటీని నింపారు. మోర్‌ దేన్‌ ఫ్రెండ్‌షిప్‌ అనే ఫీల్‌ క్రియేట్‌ చేశారు. హౌస్‌ నుండి బయటికొచ్చాక, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే, మా మధ్య ఏం లేదు అని తేల్చేశారు. కానీ, బిగ్‌బాస్‌ హౌస్‌ ద్వారా ఈ జంట దక్కించుకున్న ఫేమ్‌ని క్యాష్‌ చేసుకోవాలని కొందరు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

 

ఈ జంటపై ఓ క్యూట్‌ లవ్‌ స్టోరీని ప్రిపేర్‌ చేసి ఓ యంగ్‌ డైరెక్టర్‌ సిద్ధంగా ఉన్నాడట. ఆ డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చడంతో, ఓ ప్రముఖ నిర్మాత, ఆ దర్శకుడిని ప్రోత్సహిస్తున్నాడట. ఆల్రెడీ పునర్నవి భూపాళం హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే పునర్నవి నటించిన 'సైకిల్‌' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో పున్ను లుక్స్‌ ఆడియన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేశాయి. ఇంకేముంది ఆడియన్స్‌ రెస్పాన్స్‌ బాగుంది.

 

ఇక రాహుల్‌ సంగతి అంటారా.? తనను తాను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని బిగ్‌బాస్‌ షో ద్వారా తెలుసుకున్న రాహుల్‌, హీరోగా తనను తాను తెరపై చూసుకోవాలన్న కోరిక అతనికీ ఉందని ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో బయట పెట్టాడు. సో అతి త్వరలోనే రాహుల్‌ - పున్నూ జంటగా సినిమా సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతే అయినా, లో బడ్జెట్‌లో ప్రామిసింగ్‌గా సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట. చూడాలి మరి, బుల్లితెరపై తెచ్చుకున్న క్రేజ్‌ని పెద్ద తెరపై రాహుల్‌ - పున్ను నిలబెట్టుకుంటారో.? లేదో.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS