ఈ శుక్రవారం విడుదలైన `గని` డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా చప్పగా ఉన్నాయి. మూడు రోజులకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్లు కూడా రాని పరిస్థితి. అయితే.. ఎందుకనో.. ఈ సినిమా విడుదలకు ముందు మంచి పాజిటీవ్ బజ్ నడిచింది.
`గని` సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందన్న వార్త... టాలీవుడ్ అంతా వ్యాప్తి చెందడంతో నిర్మాతలు మందు చూపుతో కర్చిఫులు సిద్ధం చేసుకున్నారు. దర్శకుడు కిరణ్ కొర్రపాటికి ఏకంగా నలుగురు నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ఇందులో మైత్రీ, మాట్నీ లాంటి బడా సంస్థలు కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ నలుగురు నిర్మాతలూ... వెనక్కి తగ్గారు. కనీసం యావరేజ్‌గా నిలిచినా ఈ నలుగురిలో ఒకరు కమిట్ అయిపోదురు. ఆ ఛాన్సు కూడా లేకుండా పోయింది. అడ్వాన్సులు తిరిగి తీసుకోవడం అంటూ ఉండదు గానీ, సినిమాలే చేయరు. అడ్వాన్సుతో పోయేదానికి.. సినిమా తీసి, బాధ పడడం ఎందుకు అనేది నిర్మాతల మరో ముందస్తు ఆలోచన. ఈమధ్య ఓ డెబ్యూ డైరెక్టర్ కి సినిమా విడుదల కాకముందే నలుగురు అడ్వాన్సులు ఇవ్వడం.. ఓ రికార్డయితే, నలుగురూ ఇప్పుడు సైలెంట్ అయిపోవడం కూడా మరో అరుదైన రికార్డే అనుకోవాలి.