'గంటా' వారి సినిమా వచ్చేస్తుందహో!

మరిన్ని వార్తలు

ప్రముఖ రాజకీయ వేత్త, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జయంత్‌ సి పరాన్జీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రవితేజని హీరోగా చేసేందుకు గంటా శ్రీనివాసరావు పెద్దగా కష్టపడకపోయినప్పటికీ, ఆ సినిమాని మార్కెట్‌ చేసేందుకు మాత్రం కష్టపడాల్సిన పరిస్థితే. సినిమా సక్సెస్‌ విషయంలో పబ్లిసిటీ ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే ఈ సినిమాకి విశేషంగా పబ్లిసిటీ చేస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి సినీ రంగంలో చాలా మందితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ రకంగా ఆయన కుమారుడైన గంటా రవితేజ నటిస్తున్న 'జయదేవ్‌' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా, గంటా చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులను కలిశారు. మరో పక్క జయదేవ్‌ పాత్రలో గంటా రవితేజ సూట్‌ ఆయ్యాడా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఛానెల్స్‌లో ఈ సినిమా ప్రోమోస్‌తో, డైలాగ్స్‌తో అదరగొట్టేస్తున్నారు. రవితేజ కూడా సినిమా కోసం బాగా కష్టపడ్డాడట. ఔట్‌పుట్‌ బాగుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఇన్‌ సైడ్‌ సోర్సెస్‌ రికార్డులు చాలా బాగున్నాయి ఈ సినిమాకి. ఫైట్స్‌, డాన్సులు కూడా రవి బాగా చేశాడంటూ టాక్‌ వస్తోంది. మాళవికా రాజ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS