ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేయనున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పోసాని పాల్గోననున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ విషయం పై ఆయన స్పందించాడు.
ఈ విషయం పై పోసాని ఒక ఛానల్ తో మాట్లాడుతూ- తనని అయితే ఈ విషయం పై ఇంతవరకు ఎవరు స్పందించలేదు అని, ఒక వేళ అడిగితే తాను మాత్రం రోజుకి రూ 10లక్షలు ఇస్తే తప్ప చేయను అని స్పష్టంచేశాడు.
అలాగే మొత్తం 30 రోజులకి కలిపి రూ 3 కోట్ల చెక్ ఇస్తే అప్పుడు చేస్తానని కుండబద్దలు కోట్టేశాడు. ఈ మాటలు విన్న ప్రతిఒక్కరు షాక్ అయ్యారు.
మొత్తానికి షోలో పాల్గోనకముందే పోసాని సంచలనం రేపాడు అనే చెప్పాలి.