జూబ్లీ హిల్స్, రోడ్‌నెం. 45లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇల్లు కూల్చేస్తున్నారా?? అవుననే అంటున్నాయి జీహెచ్ ఎమ్ సీ వర్గాలు. జూబ్లీ హిల్స్‌లో ఓ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం జీహెచ్ ఎమ్సీ కి అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలంటే... రోడ్ నెం 45కి ఆనుకొని ఉన్న కొన్ని భవనాలను తొలగించాల్సిందే. అందులో భాగంగా బాలయ్య ఇంటి ప్రహరి గోడను కూల్చి వేయక తప్పదని సమాచారం.
నిన్నా మొన్నటి వరకూ జీహెచ్ ఎమ్ సీ పర్యావరణ ట్రిబ్యునల్ అనుమతుల కోసం ఎదురుచూసింది. ఇప్పుడు అవీ వచ్చేశాయి. ఈ విషయమై జీహెచ్ ఎమ్సీ అధికారులు బాలకృష్ణతో సంప్రదింపులు జరిపారట. ప్రభుత్వం తరపునుంచి అందే నష్టపరిహారం గురించి కూడా బాలయ్యతో చర్చించినట్టు తెలుస్తోంది.