గిల్లు జోసెఫ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. కారణం ఆమె ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ ఫోటో పైన కనిపించడమే.
ఇందులో పెద్ద విశేషం ఏమి ఉంది అని మీరు అనుకోవచ్చు. ఆమె ఆ కవర్ ఫోటో లో ఒక పసిబిడ్డకి స్థన్యాన్ని ఇస్తూ కనిపించింది.
దీని పైన కొందరు ఈమెని తిట్టిపోస్తున్నారు, కొన్ని చోట్ల అయితే గిల్లు జోసెఫ్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఆమె కేవలం పబ్లిసిటీ స్టంట్ కొరకే ఇటువంటి పని చేసింది అని ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. అయితే ఈ వీటన్నిటిని తాను ఏమాత్రం లెక్క చేయను అని ఆమె తెల్చిచేప్పేసింది.
కారణం- తల్లి పాలు పిల్లలకి ఎంత శ్రేయస్కరమో అని చెప్పడం కోసం జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకున్నాక అది తనకి బాగా నచ్చడంతో ఆ మ్యాగజైన్ పైన పసిబిడ్డకి తన స్థన్యాన్ని ఇస్తూ ఫోటో దిగడానికి ఒప్పుకున్నాను అని అంతేతప్ప ఇందులో ఎటువంటి పబ్లిసిటీ లేదు అని మరోసారి కుండ బద్దలు కొట్టింది.
మొత్తానికి ఆమె ఏ కారణంతో చేసినా ఇప్పుడు ఇది మాత్రం ఒక పెద్ద వైరల్ అయి కూర్చుంది.