మనకి ఎప్పటినుండో ఒక మాట జనసామాన్యంలో బాగా ప్రాచ్యురంలో ఉంది అలాగే సైన్సు పరంగా కూడా అది నిరూపణ అయింది కూడా. అదే- మేనమామ పోలికలు మేనల్లుడికి రావడం. ఇది చాలా మందిలో చూస్తుంటాము అయితే ఇక్కడ మాత్రం ఒక అల్లుడు అచ్చంగా తన మేనమామ బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నాడు.
అదెవరో కాదు సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్. ఆయన ఫాలో అవుతున్నది తన మేనమామ పవన్ కళ్యాణ్ ని. బయట మాట్లాడేటప్పుడు నాకు ముగ్గురు మావయ్యలు- చిరంజీవి, నాగబాబు & పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అని చెప్పడం విన్నాము. అయినప్పటికీ తేజ్ కి తన చిన్నమామయ్య అంటే ఎక్కడో కొద్దిగా ఎక్కువ ఇష్టం అని స్పష్టం అవుతుంటుంది ఆయన నడవడిక ద్వారా...
మీరు ఒకసారి గత సంవత్సర కాలం నుండి గమనిస్తే తేజ్ సినిమా ప్రమోషన్స్ లో కాని ఏ ఇతర కార్యక్రమాలలో కాని చేనేత వస్త్రాలు వేసుకునే వస్తున్నాడు (కుర్తా). ఇక పవన్ విషయానికి వస్తే ఆయన కనిపించే విధానం అంత చేనేత వస్త్రాలలోనే అలాగే ఆయన చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ కూడా..
ఈ మధ్యనే ఒక ప్యారా అథ్లెట్ కి ఆర్ధికంగా సహాయం చేయడం వంటివి ఆయన తన చిన్న మామ నుండి స్పూర్తిగా తీసుకున్నదే అని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు లు కూడా తమ అభిమానులకి విరివిగా ఇటువంటి సహాయం చేస్తూనే ఉంటారు. కాని ఇలా అభిమానేతరులకి కూడా చేయడం అంటే పవన్ నుండి వచ్చిన లక్షణమే అని చెప్పొచ్చు.
ఇక ఏదైనా ఈవెంట్స్ లో మాట్లాడే సందర్భంలో చివరగా జైహింద్ అని పవన్ లాగా అనడం అలాగే తన చిన్నమామకి రాజకీయంగా చేసే ప్రయత్నానికి తనవంతు మద్దతు, సహాయం ఎప్పట్టికీ ఉంటుంది అని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశాడు.
చివరగా- తన చిన్న మామ బాటలో నడుస్తున్న ఈ ముద్దుల మేనల్లుడు కూడా తన మామయ్య అంత గొప్పగా జీవితంలో ఎదగాలని కోరుకుందాం..