బాలీవుడ్లో లేడీ నిర్మాతగా కొనసాగుతోన్న ఏక్తాకపూర్కి అస్సలు మొహమాటమే ఉండదు. తనకు ఏది అనిపిస్తే అది డైరెక్ట్‌గా అనేస్తుంటుంది. ఒక్కోసారి బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా విచ్చలవిడిగా ఇచ్చేస్తుంటుంది. అయితే, ఈ సారి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో ఈ భామ తెలుసా? సెక్స్ గురించి తనదైన శైలిలో స్టేట్మెంట్ ఇచ్చేసింది.
అందుకే మళ్లీ న్యూస్‌లో హల్చల్ చేసింది. ఇంతకీ ఈ హాట్ ప్రొడ్యూసర్ చేసిన ఘాటు వ్యాఖ్యలేంటంటే, 'నాకు సెక్స్ అనేది అస్సలు విషయమే కాదు.. అయినా సెక్స్ సినిమాల్లో నటించేవాళ్లకూ, అవి చూసి ఆనందించే వాళ్లకూ లేని తంటా సెన్సార్ బోర్డ్‌కి ఎందుకు.? ఎంతో కష్టపడి తీసిన ఆ సీన్లని ఇష్టమొచ్చినట్లు కత్తెర వేసి తొలగించేస్తారు..' అంటూ మండి పడింది.
ఇంతవరకూ సినిమాలకు మాత్రమే సెన్సార్ ఉంది. ఆన్లైన్ సిరీస్‌కి నో సెన్సార్. బట్ కొద్ది రోజుల్లోనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కీ కూడా సెన్సార్ ఉండాలని సుప్రీంకోర్డులో ఫిర్యాదు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై ఎలాంటి తీర్పు వెలువడుతుందో ఇంకా తెలీదు. కానీ, మన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం ఈలోగానే ఈ విషయమై ఇలా బోల్డ్ కామెంట్ చేసి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది.