గ్లామ్‌ షాట్‌: బికినీలో ఆదా.. అవ్వాల్సిందే ఫిదా!

By iQlikMovies - April 28, 2018 - 19:37 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ ఆదా శర్మ సోషల్‌ మీడియాలో బికినీలతో ప్రభంజనమే సృష్టించేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బికినీ పాఠాలే చెప్పేస్తోంది. అందం చూడవయా.. ఆస్వాదించవయా.. అంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోలతో కిర్రాకు పుట్టించేస్తోంది ఈ అందాల భామ.

 

చేసే సినిమాలకంటే సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ అందాల విందుకే అభిమానులు ఎక్కువగా ఫిదా అయిపోతున్నారు. ఇదిగో ఈ ఫొటోలో చూస్తున్నారు కదా ఆదా శర్మ ఏ స్థాయిలో బికినీ గ్లామర్‌ ఒలకబోసేస్తోందో. బికినీకే గ్లామర్‌ తీసుకొచ్చింది ఆదా శర్మ. ప్రస్తుతం తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తోన్న ఆదా శర్మ, తెలుగులో మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తోందట.

 

ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్‌. ఈ బ్యూటీ ఎంత అందంగా వుంటుందో అంతే అందంగా పాటలు కూడా పాడగలదు. అన్నిటికీ మించి ఆదా శర్మ పెట్‌ లవర్‌. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే తన బ్యూటీతో సోషల్‌ మీడియాలో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోన్న ఆదా శర్మకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS