హీరోయిన్గా కావల్సిన అన్నిలక్షణాలు టన్నుల లెక్కన ఉన్నా, అందాల భామ ఆదాశర్మ కేవలం స్పెషల్ ఫోటో షూట్స్కే పరిమితమైపోయిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన అనుభవం ఉన్నా, స్టార్డమ్ మాత్రం సీత కన్నేస్తోంది ఆదాశర్మపై. మల్టీ టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మ అయినా, ఆమె టాలెంట్‌ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు ఫిలిం మేకర్స్. అందుకే, తన అందాలని అడవి కాచిన వెన్నెల చేయడం ఇష్టం లేని ఆదా శర్మ ఓన్ ఇంట్రెస్ట్‌తో స్పెషల్ ఫోటో షూట్స్ చేయించుకుంటూ కాలక్షేపం చేస్తుంటుంది.
తాజాగా రెడ్ కలర్ హాట్ డ్రస్‌లో అందంగా దర్శనమిస్తూ కుర్రకారు దృష్టిని మరోసారి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఆదా ప్రయత్నిస్తే ఫలితం దక్కకుండా ఉంటుందా.? ఈ ఫోటోకి బోలెడన్ని లైకుల కేకులు క్యూ కట్టేస్తున్నాయి. ఇక ఆదాశర్మ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే, తెలుగులో ఓ సినిమాలో నటిస్తోందట. కానీ, ఆ సినిమా వివరాలు మాత్రం తెలియడం లేదు. ఆ సంగతి అలా ఉంచితే, తాజా పిక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరముందండోయ్. డ్రస్‌కి మ్యాచింగ్ ఉంగరంతో పాటు, నుదుటిన పాత సినిమాల్లో హీరోయిన్లా పావలా కాసంత బొట్టు పెట్టి లూజ్‌గా హెయిర్ వదిలేసింది. హెయర్తో పాటు, క్లీవేజ్ అందాలు కూడా వదిలేసింది. అదీ సంగతి.