గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రాకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోనూ ఆమెకున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఈ మధ్య యంగ్‌స్టర్ నిక్ని వివాహమాడి మరోసారి హాట్ హాట్‌గా అందరి దృష్టినీ ఆకర్షించింది దేశీ గాళ్ ప్రియాంకా చోప్రా. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలోనూ ప్రియాంకా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఫ్యాషన్ విషయంలో ప్రియాంకా ఆమెకి ఆమే సాటి. తాజాగా ప్రియాంకా ధరించిన బ్లాక్ డ్రస్సు సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది. పార్షియల్గా అందాలను ఎలివేట్ చేస్తూ, బ్లాక్‌పై డిజైన్ చేసిన వైట్ డాట్స్ ఈ కాస్ట్యూమ్‌కి హైలైట్ అవుతున్నాయి. మ్యాచింగ్ వాలెట్, మ్యాచింగ్ హైహీల్స్ ఈ డ్రస్సుకి అదనపు ఆకర్షణ. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కళ్లకు కూలింగ్ గ్లాస్‌తో అలా అలా వయ్యారంగా వీధిలో నడిచొస్తున్న ప్రియాంకా అందానికి అంతా ఫిదా అవ్వాల్సిందే సుమీ.