నటిగా దాదాపు పదేళ్ళ కెరీర్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికీ సమంత కెరీర్‌లో జోరు తగ్గలేదు సరికదా, ఆ జోరు ఇప్పుడు మరింత పెరిగింది. గ్లామరస్ పాత్రల్లో కన్పించింది. పెర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. పెళ్ళయ్యాక కూడా సమంత కెరీర్ కొనసాగుతోంది. కొనసాగడమేంటి, వెరైటీ పాత్రలతో సత్తా చాటుతోందామె ఇప్పుడు. సక్సెస్ సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తే, కమిట్‌మెంట్‌తో పనిచేయడమేనని చెబుతుంటుంది సమంత.
గ్లామర్ విషయంలోనూ సమంతకి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. తెరపైన ఏం చేసినా అది నటనలో భాగమేనని చెప్పే సమంత, దాన్ని రియాల్టీతో పోల్చి విమర్శలు చేయడం మంచిది కాదని క్లారిటీ ఇచ్చింది. 'మజిలీ' సినిమా తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన సినిమా అంటోంది ఈ బ్యూటీ. ఇదొక్కటే కాదు, సమంత నుంచి ఈ ఏడాది చాలా చాలా భిన్నమైన చిత్రాలు రాబోతున్నాయి. అందులో 'సూపర్ డీలక్స్' కూడా ఒకటి.
'96' తెలుగు రీమేక్ కూడా సమంతకి చాలా ప్రత్యేకమైనది. 'ఓ బేబీ' కూడా అంతే. కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాలు చూశాననీ, అవన్నీ సహజమేననీ, గాసిప్స్ ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటాయనీ, అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ పోతే కెరీర్‌లో ముందుకెళ్ళలేమని చెబుతున్న సమంత, అలాగని గాసిప్స్‌ని ఊరికే వదిలెయ్యకూడదని కూడా అభిప్రాయపడింది. లిప్ కిస్ అయినా, బోల్డ్ యాక్ట్ అయినా అందంగానే వుండాలని సమంత అభిప్రాయపడింది.