డబుల్‌ ధమాకా: దటీజ్‌ మెగా డాటర్‌.!

మరిన్ని వార్తలు

'సూర్యకాంతం' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది మెగా డాటర్‌ నిహారిక. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నిహారిక. మరోవైపు బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల బరిలో భాగంగా నామినేషన్‌ వేసేందుకు రెడీగా ఉన్నాడు. రేపో మాపో ఎన్నికల ప్రచారానికి దిగనున్నాడు. ఈలోగానే ఫ్యామిలీ నుండి ముందుగా పవన్‌కళ్యాణ్‌కి సపోర్ట్‌ వచ్చేసింది. అది కూడా మెగా డాటర్‌ నిహారిక నుండి. 

 

'సూర్యకాంతం' సినిమా ప్రమోషన్స్‌తో పాటు, బాబాయ్‌ తరపున జనసేన పార్టీ ప్రచారం కూడా నిర్వహించేస్తోంది తెలివిగా నిహారిక. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌ నుండి వస్తున్న బాబాయ్‌ ప్రస్థావనకు అభిమానులతో పాటు తాను కూడా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అంటూ జై కొడుతుంది. అలాగే అక్కడ జై కొడుతున్న వాళ్లంతా జెన్యూన్‌గా పవర్‌స్టార్‌కి ఓటేసి పవన్‌ని సీఎంని చేయాలని నినదిస్తోంది. 

 

నిహారిక ఆటిట్యూడ్‌ చూసి ఫ్యాన్స్‌ కూడా అవాక్కవుతున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్‌లో నిహారిక కొత్త జోష్‌ని నింపుతోంది. ఈ జోష్‌తో నిహారికకు డబుల్‌ ధమాకానే. మార్చి 29న విడుదల కాబోతున్న 'సూర్యకాంతం' సినిమా సక్సెస్‌ ఓ వైపు. మరోవైపు బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌కి ఎలక్షన్స్‌లో సపోర్ట్‌. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇదేనేమో. దటీజ్‌ మెగా డాటర్‌. కీప్‌ ఇట్‌ అప్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS