దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇటీవల ఎవరికీ దక్కలేదు. ఎప్పుడో విజయశాంతి ఆ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. దాదాపుగా ఆ తర్వాత ఎవరూ ఆ స్థాయిని అందుకోలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్, అందాల భామ నయనతారకు దక్కిందని తమిళ సినీ వర్గాలంటున్నాయి.
ఇటీవలి కాలంలో నయనతార రెమ్యునరేషన్ పరంగా, సక్సెస్‌ల పరంగా ఎదుగుతోన్న తీరు చూస్తే ఆమె సౌతిండియా సినిమాకి సంబంధించి లేడీ సూపర్ స్టార్‌గా మారిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. వరుస విజయాల్ని అందుకోవడం నయనతారని లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌కి దగ్గర చేస్తే, ఆమెని సెంట్రిక్‌గా చేస్తూ దర్శక నిర్మాతలు సినిమాలు రూపొందిస్తుండడం ఇంకో సానుకూల అంశం. నయనతార ఏ సినిమా చేసినా, ఆమెదే అత్యధిక రెమ్యునరేషన్. అందులో ఎంత పెద్ద హీరో నటించినాసరే (చాలా అరుదుగా మాత్రమే స్టార్ హీరోలతో నయనతార సినిమాలు చేస్తోంది), నయనతారకే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుతోందట.
ఒక్కోసారి బడ్జెట్‌తో సమానంగా నయనతారకి రెమ్యునరేషన్ ఇస్తున్నారట. 2 కోట్లు ఆ పైన, ఆయా సినిమాల్ని బట్టి నయనతార రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని సమాచారం. మూడు నాలుగు కోట్ల దాకా కూడా నయనతారకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారంటే ఆమె స్టార్‌డమ్ ఎలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏదో ఒక సినిమా చేసేద్దామనుకోవడంలేదు నయనతార. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలా తన స్టార్‌డమ్‌ని మరింత పెంచుకుంటోన్న నయనతారని లేడీ సూపర్ స్టార్ అని నిస్సందేహంగా పిలిచేసుకోవచ్చు.