'గాడ్ ఫాదర్' సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - September 23, 2022 - 18:29 PM IST

మరిన్ని వార్తలు

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ ల 'గాడ్ ఫాదర్' సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ 'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. 'గాడ్ ఫాదర్' పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ చిత్రమిది. తమన్‌ స్వరాలందిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. పొలిటికల్ నేపధ్యం వున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతోపాటు ‘భోళా శంకర్‌’ (మెహర్‌ రమేశ్‌ దర్శకుడు), బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు చిరంజీవి. మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమాను ఖరారు చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS