‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ &రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు
దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్
ఎడిటర్: తమ్మిరాజు


రేటింగ్: 2.5/5


రొమాంటిక్‌ కామెడీ నాగశౌర్యకి బాగా కలిసొచ్చిన జోనర్. రొమాంటిక్‌ కామెడీ కథలు శౌర్యకి బాగా నప్పుతాయి. ఇప్పుడు శౌర్య నుండి మరో రొమాంటిక్‌ కామెడీ వచ్చింది. అదే ‘కృష్ణ వ్రింద విహారి’. 'అలా ఎలా' లాంటి మంచి రొమాంటిక్ కామెడీ తీసిన అనీష్‌ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు కావడం మరో విశేషం. బేసిగ్గా శౌర్య ప్రమోషన్స్ కి దూరంగా ఉంటాడు. కానీ ఈ సినిమా కోసం పాదయాత్ర చేసి బావుంటుందని నమ్మకంగా చెప్పాడు. మరో శౌర్య నమ్మకం నిలబెట్టుకున్నాడా ? ఇంతకీ కృష్ణ వ్రింద విహారి’ కథ ఏమిటి ? 


కథ :


కృష్ణ (నాగశౌర్య)ది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. కృష్ణని ఆచార వ్యవహారాల మధ్య చాలా పద్ధతిగా పెంచుతుంది తల్లి అమృతవల్లీ (రాధిక) . హైదరాబాద్లో ఉద్యోగం కోసం వచ్చిన కృష్ణ, వ్రింద (షెర్లీ సెటియా)ను ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటాడు. కానీ, వ్రిందా ఓ సమస్యతో బాధపడుతుంటుంది. అందుకే పెళ్లికి నిరాకరిస్తుంది. ఆ సమస్య ఏమిటి ? తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించేందుకు కృష్ణ ఎలాంటి అబద్ధం ఆడాడు? పెళ్లి తర్వాత ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడనేది మిగతా కథ


విశ్లేషణ:


కృష్ణ వ్రింద విహారి’ పాయింట్ చాలా బావుంటుంది. ఈ కథ చెప్పగానే నాగశౌర్యకి ఈ పాయింటే నచ్చుటుంది. అయితే బ్యాడ్ లాక్ ఏమిటంటే.. ఇదే పాయింట్ తో నాని అంటే సుందరానికీ సినిమా వచ్చేసింది. అదే పాయింట్ .. అదే బ్రాహ్మణ నేపధ్యం. దీంతో ‘కృష్ణ వ్రింద విహారి’ కాస్త అంటే .. కృష్ణకీ అన్నట్టుగా వుంటుంది. బ్రాహ్మణ సంప్రదాయాలు, ఆచారాల వ్యవహారాలతో కృష్ణ ఎంట్రీ,. తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం, ఆఫీస్ లో ప్రేమ, సత్య, రాహుల్ రామకృష్ణ కామెడీతో సినిమా సరదాగానే ముందుకు సాగిపోతుంది. ఎక్కడైతే అసలు కథ మొదలౌతుందో అక్కడి నుండి అంటే సుందరానికీ సినిమా మళ్ళీ చూస్తున్నామా అనిపిస్తుంది. 


ఐతే ద్వితీయార్ధంలో వచ్చే సరికి ఈ కథని ఫ్యామిలీ డ్రామాగా మలిచాడు దర్శకుడు. అత్తాకోడళ్ళ డ్రామాని కొంత సేపు సీరియల్ లా నడిపాడు. ఇది రొటీన్ గానే వుంటుంది. అయితే నాగశౌర్య తన టైమింగ్ తో ఈ ట్రాక్ కి కొంత ఫ్రెస్ నెస్ యాడ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో మరో సమస్య . కృష్ణ వ్రింద మధ్య కెమిస్ట్రీని సరిగ్గా ప్రజంట్ చేయలేదు. వ్రింద ఆవేశంలో ఒక అర్ధం వున్నా.. దాన్ని తెరపైకి తెచ్చిన విధానం ఆ పాత్రలని నడిపిన విధానం ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా ముందే తెలిసిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం నవ్వులు పంచుతుంది. కిషోర్ కోమా డ్రామా కథలో వర్క్ అవుట్ అయ్యింది. 


నటీనటులు :


నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. శౌర్య లుక్స్ బావున్నాయి. కృష్ణ పాత్రని మంచి ఈజ్ తో చేశాడు. ఎమోషనల్ సీన్లలోనూ శౌర్యనటన ఆకట్టుకుంటుంది. షెర్లీ సెటియా నటన డీసెంట్ గా వుంది. ఈ కథకి నప్పింది. కీలకమైన పాత్రలో రాధిక మెప్పించింది. వెన్నెల కిషోర్.. సత్య.. బ్రహ్మాజీ.. రాహుల్ రామకృష్ణ కొన్ని నవ్వులు పంచారు. మిగతా నటులు పరిధిమేర చేశారు. 


టెక్నికల్ గా:


మహతి సాగర్ అందించిన ఏముందిరా, టైటిల్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. వర్షంలో వెన్నెల్లా పాట రోమాన్స్ ని యాడ్ చేసింది. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. అనిష్ రాసుకున్న డైలాగ్స్ కొన్ని పేలాయి. ఐరా నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి.   


ప్లస్ పాయింట్స్ 


నాగశౌర్య
షెర్లీ సెటియా
కొన్ని కామెడీ సీన్స్ 
పాటలు 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్ 


చూసిన కథే 
పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం 


ఫైనల్ వర్డిక్ట్ : అంటే.. కృష్ణకీ..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS