మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు బర్త్ డే వేడుకలు మొదలైపోయాయి. 'గాడ్ ఫాదర్' టీజర్ వచ్చేసింది. పవర్ ఫుల్ గా వుంది టీజర్.''ఇరవై ఏళ్ళు ఎక్కడి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. సడన్ గా తిరిగొచ్చిన ఆరేళ్ళలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు''. ''ఇక్కిడికి ఎవరొచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు''. '' డూ యు నో హూ హి ఇస్ ? హిఈజ్ ది బాస్ అఫ్ ది బాసస్. అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్''. ఈ మూడు డైలాగులతో క్యురియాసిటీ పెంచి మెగాస్టార్ ని రివిల్ చేయడం, ఆయన రెండు చేతులతో గన్స్ పేల్చడం అభిమానులని అలరించింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కు కుడి భుజంగా భారీ యాక్షన్ తో కనిపించారు. “లగ్ రహా హై బడి లంబీ ప్లానింగ్ చల్ రహీ హై. అప్నే ఇస్ ఛోటే భాయ్ కో భూల్ నా నహీ.. కహే తో ఆజాతా హూ మై...” అని సల్మాన్ చెప్పగా,,. ''వెయిట్ ఫర్ మై కమాండ్' అని చిరు చెప్పడం ఇంట్రస్టింగా వుంది . టీజర్‌లోని ప్రతి సీక్వెన్స్ ఎలివేషన్ ఆకట్టుకుంది. టీజర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ జీపులో కలిసి రావడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 2022 దసరా కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.