కార్తి, విజయ్‌లకు కలిసొచ్చే దీపావళి!

మరిన్ని వార్తలు

విడుదలకు చాలా సినిమాలే ఉన్నాయి. కానీ, దీపావళి స్లాట్‌ని ఎందుకో మన తెలుగు హీరోలు లైట్‌ తీసుకున్నారు. అందరూ ఈ సారి క్రిస్‌మస్‌నే టార్గెట్‌ చేశారు. సరిగ్గా ఇదే మంచి సమయం అనుకున్న తమిళ తంబీలు టాలీవుడ్‌పై డబుల్‌ ఎటాక్‌కి సిద్ధమయ్యాయి. కార్తి నటిస్తున్న 'ఖైదీ' సినిమా దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికి తెలుగులో ఉన్న మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నమోదయ్యాయి. అంతేకాదు, ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేకపోవడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశమే.

 

తెలుగులో ప్రత్యేకంగా ప్రమోషన్స్‌ కూడా చేశాడు కార్తి. ఇకపోతే, మరో తమిళ సినిమా విజయ్‌ నటించిన 'విజిల్‌'. కార్తితో పోల్చితే, విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్‌ లేకపోయినా, గత చిత్రాలు 'అదిరింది' తదితర సినిమాలు విజయ్‌కి తెలుగులోనూ మంచి విజయాలందించాయి. అదే కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'విజిల్‌'. అట్లీ దర్శకుడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ సినిమాని తెలుగులో బాగానే ప్రమోట్‌ చేశారు. సో విజయ్‌ సినిమాకీ మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశాలున్నాయి.

 

విజయ్‌ సరసన నయనతార నటించడం ఈ సినిమాకి మరో ఆకర్షణ. తమిళ సినిమాల సందడిలా ఉంటే, తెలుగులో 'తుపాకీ రాముడు' అనే ఓ చిన్న సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? బిత్తిరి సత్తి. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్‌తో బిత్తిరి సత్తి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా టీజర్‌ రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS