గూఢచారి బడ్జెట్ ఎంతో తెలిసిపోయిందిగా

By iQlikMovies - August 09, 2018 - 18:36 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గూడచారి చిత్రం గురించిన చర్చనే నడుస్తున్నది, దీనికి ప్రధాన కారణం- ఈ సినిమాకి వెచ్చించిన బడ్జెట్.
అయితే ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించిన చర్చ విడుదలకి ముందు నుండే నడుస్తున్నది, అతితక్కువ బడ్జెట్ లో చాలా అద్బుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇంతకి ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టారు అన్నది మాత్రం తెలియరాలేదు.

నిన్న ఈ చిత్రాన్ని మెచ్చుకోవడానికి వచ్చిన కింగ్ నాగార్జున ముందు తన ఆనందాన్ని పంచుకుంటూ అడివి శేష్ ఈ సినిమా బడ్జెట్ ఎంతో చెప్పేశాడు. ఇంతకి ఆ బడ్జెట్ ఎంత అంటే- రూ 6 కోట్లు. నమ్మబుద్ధి కావడంలేదు కదా... అవును ఈ సినిమా చూసిన ఎవరికైనా సరే ఈ సినిమాని ఇంత తక్కువ మొత్తంలో నిర్మించారు అంటే నమ్మశక్యంగా ఉండదు.

ఈ సినిమాలో చూసిన లోకేషన్స్, కెమెరాపనితనం ఇలాంటివి చాలా ఈ సినిమా క్వాలిటీని పెంచి చూపించాయి. అయితే ఈ బడ్జెట్ తెలుసుకున్న తరువాత మాత్రం గూఢచారి యూనిట్ ఎంత ప్లానింగ్ తో ఈ సినిమా తీసారో అన్న క్లారిటీ మనకి వస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS