ఈ సంవత్సరం హిట్ అయినవి 3 మాత్రమే-నాగ్

By iQlikMovies - August 09, 2018 - 18:34 PM IST

మరిన్ని వార్తలు

తనకి ఏదైనా సినిమా నచ్చితే ఎంతవరకైనా వెళ్ళి ఆ సినిమా గురించి ప్రచారం చేసే వ్యక్తి కింగ్ నాగార్జున. ఇక ఆయన నిన్న గూఢచారి చిత్రానికి సంబందించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి.

ఆ వివరాల్లోకి వెళితే, గూడచారి సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడుతూ- "అసలు ఇంత తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ తో ఈ సినిమాని ఎలా తీసారు? ఇది చూసాక మిగితావారికి సినిమా తీయడం రావట్లేదా? లేక బద్దకస్తులమైపోయామా అన్న సందేహం వస్తున్నది. ఈ సినిమా చూసాక.. నేను ఎందుకు ఇలాంటి ఒక సినిమా చేయలేకపోయానా అన్న దిగులు వస్తున్నది.

నాకు తెలిసి ఈ సంవత్సరం విడుదలైన అన్ని సినిమాలలో హిట్ అయినవి మూడు మాత్రమే.. అందులో ఒకటి రంగస్థలం, రెండవది మహానటి, మూడవది గూఢచారి".

ఇక ఈ మాటలు విన్న అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా నాగ్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS