గోపీచంద్ సినిమా `ఆరడుగుల బుల్లెట్` గుర్తుందా? నయనతార కథానాయికగా నటించిన సినిమా ఇది. బి.గోపాల్ దర్శకుడు. రెండేళ్ల క్రితం విడుదల కావల్సింది. విడుదల తేదీ కూడా ప్రకటించారు. చివరి క్షణాల్లో వాయిదా పడింది. అప్పటి నుంచీ ఈ సినిమా ఊసే లేదు. జనాలు కూడా క్రమంగా మర్చిపోయారు. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమేజాన్ ప్రైమ్, జీ 5, అహా సంస్థలు ఈ సినిమాని కొనడానికి ముందుకొచ్చాయట. నిజానికి ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అందుకే విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీకి అమ్మి, అప్పులు తీర్చుకుందామని నిర్మాత ప్లాన్. ఈ సినిమాని అమ్మితే కనీసం 5 నుంచి 8 కోట్ల వరకూ వస్తుంది. ఆ డబ్బుతో బాకీలు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి ఈసారైనా గోపీచంద్ బుల్లెట్ దిగుతుందా, లేదా అనేది చూడాలి.