‘వకీల్‌ సాబ్‌’ ‘పవర్‌’ ట్రీట్‌ రేపే విడుదల.!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘వకీల్‌ సాబ్‌’ నుండి మొన్న రిలీజైన ఫస్ట్ లుక్ సంచనాలు సృష్టిస్తే, ఇప్పుడు మరో సంచనానికి తెర లేపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ రాబోతోంది. వుమెన్స్‌ డే సందర్భంగా ఈ సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఇప్పటికే ఈ సాంగ్‌లో ‘మగువా.. మగువా..’ అంటూ సాగే పల్లవి రాగాన్ని వదిలి, మెస్మరైజ్‌ చేసేశారు.

 

ఇక రావల్సిన ఆ ఫుల్‌ సాంగ్‌ కూడా వచ్చేస్తే, కొట్టాల్సిన రికార్డు కొల్లగొట్టడమే తరువాయి. తన గాత్రానికి పదును పెట్టి, ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ని తన ఖాతాలో వేసుకుంటూ, ట్రెండిరగ్‌లో ఉన్న సిద్‌ శ్రీరామ్‌ గాత్రమే ఈ పాటకీ నెలవైంది. ఆయన గొంతులో ఈ పాట తేనెలూరుతోంది. థమన్‌ సంగీతమందించిన ఈ సాంగ్‌ మార్చి 8న రిలీజ్‌ చేయనున్నారు. ఇకపోతే, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వకీల్‌ సాబ్‌’ మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్‌లో ముగ్గురు హీరోయిన్స్‌ నటించగా తెలుగు వెర్షన్‌లో ఇద్దరే ఎంపికయ్యారు ఇంతవరకూ. అయితే, ఆ మూడో పాత్రను సస్పెన్స్‌గా ఉంచారా.? లేక రెండు ఫీమేల్‌ క్యారెక్టర్స్‌తోనే సరిపెట్టేశారా.? అనేది ప్రస్తుతానికి తెలీదు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాని నిర్మించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS