ట్విట్టర్‌లో సూపర్‌ స్టార్‌ సరికొత్త రికార్డు.!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ట్విట్టర్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో 90 లక్ష ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న నటుడిగా మొదటి స్థానంలో నిలిచారు. త్వరలోనే కోటి కొల్లగొట్టడం ఖాయమంటూ ఈ సందర్భంగా మహేష్‌ అభిమాను సంబరాలు చేసుకుంటున్నారు. 2010లో ట్విట్టర్‌లో అడుగుపెట్టారు మహేష్‌బాబు. ఇన్నేళ్లుగా తనను ఇంతగా ఆదరించిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారాయన. మహేష్‌ని ఏకంగా 90 లక్ష మంది ఫాలో చేస్తే, ఆయన మాత్రం కేవలం 26 మందిని మాత్రమే ఫాలో అవుతుంటారట.

 

మహేష్‌తో పాటు, ఆయన సతీమణి నమ్రతా శిరోడ్కర్‌, ఇప్పుడు తాజాగా ఆయన కూతురు సితార కూడా ట్విట్టర్‌లో సందడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడే ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ, అభిమానులకు దగ్గరగా మసలుతుంటారు. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా ‘సరిలేరు నీకెవ్వరు..’ సినిమాతో మహేష్‌బాబు సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌, వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ వెనక్కి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఆయన ప్లేస్‌లో ‘గీతా గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో మహేష్‌బాబు ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS