ఉగ్రవాదంపై 'చాణక్య' తంత్రం!

మరిన్ని వార్తలు

గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'చాణక్య' ట్రైలర్‌ని పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశారు. ఓ పక్క ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌ యాడ్‌ చేస్తూనే, మరోపక్క సీరియస్‌ కాన్సెప్ట్‌ని రన్‌ చేశారు. పాకిస్థాన్‌, ఉగ్రవాదం గట్రా క్రిటికల్‌ అంశాల్ని ఎత్తుకున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. గోపీచంద్‌ పాత్రకు రెండు వేరియేషన్స్‌ ఉన్నాయి. బ్యాంక్‌లో ఓ సాధారణ ఉద్యోగిలా కనిపిస్తున్నాడు. మరోవైపు ఓ స్పెషల్‌ మిషన్‌ని కంప్లీట్‌ చేసేందుకు పాకిస్థాన్‌ వెళ్లిన సీక్రెట్‌ రా ఏజెంట్‌లా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌ని యాక్షన్‌ ఘట్టాలతో నింపేశారు.

 

యాక్షన్‌ సినిమాలకు మనోడు అసలే పర్‌ఫెక్ట్‌ కటౌట్‌. ఇక ఎంచుకున్న అంశమైతే ట్రైలర్‌లో చూపించినట్లుగా చాలా పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌. గతంలో 'సాహసం' సినిమాలో కొంచెం అటూ ఇటూగా ఈ తరహా ఆటిట్యూడ్‌లో కనిపించాడు గోపీచంద్‌. అయితే, అక్కడ ఓ సామాన్య యువకుడు, ఇక్కడ ఓ పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌. లొకేషన్లు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోరూ, విజువల్స్‌ చూస్తుంటే సినిమాకి బాగా ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది. నిర్మాత అనిల్‌ సుంకర బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడినట్లు లేదు. ఇక అబ్బూరి రవి రాసిన మాటలు బాగా కనెక్ట్‌ అవుతున్నాయి.

హీరోయిన్‌ మెహ్రీన్‌ అందంగా కనిపించింది. 'ఎఫ్‌ 2' టైప్‌లో బబ్లీగా కనిపిస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ జరీన్‌ఖాన్‌ యాక్షన్‌ గాళ్‌గా అలరిస్తోంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పాకిస్థాన్‌లోని కరాచిరి మన హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి మిషన్‌ ఎందుకు బెడిసి కొట్టింది. 'చాణక్య' తంత్రం ప్రయోగించినా అది ఎందుకు ఫలించలేదు వంటి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే 'చాణక్య' విడుదల వరకూ ఆగాల్సిందే. అక్టోబర్‌ 5న 'చాణక్య' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS