బిగ్‌బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు

ఒకరోజు ఫుల్‌ జోష్‌తో, ఇంకోరోజు డల్‌గా.. సో సోగా నడుస్తున్న బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్ట్‌కి తెర లేపనున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీస్‌ అంటూ హౌస్‌ లోపలికి పంపించిన ఇద్దరు హౌస్‌మేట్స్‌ తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి 15 రోజుల ఎంటర్‌టైన్‌మెంట్‌.. సారీ బోరింగ్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఎనర్జీ 2.0తో మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని ప్లాన్‌ చేశారట. ఆ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని గురువారమే హౌస్‌లో ప్రవేశపెట్టనున్నామని ఓ ప్రోమో ద్వారా ఆడియన్స్‌కి హింట్‌ ఇచ్చారు.

 

అయితే, ఆ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అలీ రెజానేనా? గత కొంత కాలంగా అలీ రెజా రీ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటికే అలీ రెజా ఎంట్రీ ఉండొచ్చనుకున్నారంతా. కానీ, కాకపోవడంతో అసలింక వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లేదనుకున్నారు. కానీ, లేటెస్ట్‌ ప్రోమోతో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అయితే షురూ అయ్యింది. కానీ ఎంట్రీ ఇచ్చేది ఎవరనే విషయమై క్లారిటీ లేదు.

 

అలీనే తీసుకొస్తున్నారా? లేక ఇంకెవరైనా కొత్త వాళ్లని హౌస్‌లోకి పంపిస్తున్నారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, ఈ కొత్త వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌బాస్‌కి కొత్తగా కలిసొచ్చేదేమైనా ఉంటుందా? అనేది ఆడియన్స్‌లో మెదులుతోన్న ప్రశ్న. రీ ఎంట్రీలు కాకుండా, గ్లామరస్‌ హీరోయిన్స్‌ కానీ, ఓ మోస్తరు స్టార్‌డమ్‌ ఉన్న సెలబ్రిటీల్ని కానీ పంపిస్తే బావుంటుందని ఆడియన్స్‌ అభిప్రాయం. ఏం చేస్తారో చూడాలి మరి. ఇక ఈ వారం నామినేషన్స్‌ లిస్టులో వరుణ్‌, రవి, శ్రీముఖి, బాబా భాస్కర్‌ ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS