ఆరడుగుల అందగాడు గోపీచంద్ హీరోగా వస్తోన్న సినిమా 'గౌతమ్‌నందా'. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. పబ్లిసిటీ పనులు వేగవంతం చేశారు. ప్రమోషన్స్ చాలా బాగా చేస్తోంది చిత్ర యూనిట్. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందంటున్నారు. మాస్ అండ్ యాక్షన్ స్పెషల్ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు గోపీచంద్. చాలా రిచ్ లొకేషన్స్‌తో, ట్రైలర్‌ని చాలా రిచ్‌గా కట్ చేశాడు డైరెక్టర్. ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముద్దుగుమ్మలు హన్సిక, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాంగ్ బిట్స్ చాలా బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరో పక్క గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆరడుగుల బుల్లెట్' సినిమా ఏమయ్యిందో ఎవరికీ తెలీదు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్ చేశారు. కానీ ఆ డేట్‌కి సినిమా విడుదల కాలేదు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఏ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం కావస్తుందో తెలీని సందిగ్ఠంలో గోపీచంద్ అభిమానులున్నారు. 'జిల్', 'లౌఖ్యం' సినిమాలతో వరస హిట్లు కొట్టిన గోపీచంద్, ఈ మధ్య 'సౌఖ్యం'తో నిరాశ పడ్డాడు.ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ కూడా తీసుకున్నాడు. సో గోపీచంద్ ఆశలన్నీ 'గౌతమ్‌నందా' పైనే. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే, మొత్తానికి గోపీచంద్‌కి సంపత్ నంది 'గౌతమ్ నందా' ద్వారా పెద్ద హిట్టే ఇచ్చేలా ఉన్నాడు.