ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బుల్లితెర రియాల్టీ షో 'బిగ్‌బాస్'కి గ్లామర్ మిస్సయ్యిందంటూ ఆడియన్స్ ఆప్‌సెట్ అవుతున్నారు. దీనికి కారణం 'బిగ్‌బాస్' సెలబ్రిటీస్‌లోని 14 మంది నుండి ఓ సెలబ్రిటీ అయిన జ్యోతి ఎలిమినేట్ అయ్యింది. ఏడుగురు లేడీస్, ఏడుగురు జెంట్స్‌తో కలిపి మొత్తం 14 మంది సెలబ్రిటీస్ ఈ షోలో పార్టిసిపెంట్స్‌గా ఉన్నారు. వారి నుండి జ్యోతి ఎలిమినేట్ కావడంతో టోటల్ షోకే గ్లామర్ మిస్ అయినట్లుంది. ఎందుకంటే ఏడుగురు లేడీస్‌లోనూ కత్తి కార్తీక, మధుప్రియ, కల్పన నుండి గ్లామర్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇక ముమైత్ ఖాన్ గ్లామర్ గురించి తెలిసిందే. ఇక మిగిలిన వారు అర్చన, హరితేజ, జ్యోతి. జ్యోతి, అర్చనలు పలు సినిమాల్లో నటించారు. సో గ్లామర్ టచ్ ఈ ఇద్దరికీ ఎక్కువగా ఉంటుంది. ఇక హరితేజ సీరియల్ ఆర్టిస్టుగా తన వంతు గ్లామర్ పండిస్తుంది. ఈ గ్లామర్ నుండి జ్యోతి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌ని ఎలా భర్తీ చేస్తారో బిగిబాస్ యాజమాన్యం. అయితే ఇంతవరకూ ఈ షోకి గ్లామర్ లేదనే చెప్పాలి. ఇంతవరకూ షో పార్టిసిపెంట్స్ ఎవ్వరూ మేకప్స్ వేసుకోకుండా నేచురల్‌గా కనిపించారు. తాజాగా ఎన్టీఆర్ టీమ్ మేట్స్‌ని కొంచెం గ్లామరస్‌గా కనిపించాలని సూచించారు. దాంతో ఇప్పుడే ఈ షోకి గ్లామర్ వచ్చిందనుకోవాలి. ఈ లోగా జ్యోతి ఎలిమినేషన్ అయిపోయింది. ఆ ప్లేస్‌లోకి ఎవరొచ్చి చేరతారో. అయితే ఇక్కడ గ్లామర్ అంటే కేవలం ఎక్స్‌పోజింగ్ అనే కాదు. యాక్టివ్‌గా కనిపించడం, ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడం, నీట్ డ్రస్సింగ్.. ఎక్స్‌ట్రా అని గమనించాలి సుమీ.