ఆరడుగుల హీరో గోపీచంద్ తాజా చిత్రం గౌతమ్ నంద టీజర్ రిలీజ్ అయినరోజు నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ఇక ఈ పాజిటివ్ టాక్ ఏమేరకు వెళ్ళిందంటే గోపీచంద్ కెరీర్ లోనే అత్యధికంగా శాటిలైట్ రైట్స్ సంపాదించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ ఏకంగా రూ 5.5 కోట్లకు పొందినట్టు తెలుస్తున్నది.
ఇదే క్రమంలో నైజాం ఏరియా రైట్స్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రూ 6.6 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
మొత్తానికి గౌతమ్ నంద చిత్రం రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసేసింది