కన్నడ నటుడు ఆత్మహత్యాయత్నం శాండల్ వుడ్ లో కలకలం రేపుతున్నది.
వివరాల్లోకి వెళితే, ప్రేమ విఫలం కావడంతో వెంకట్ అనే కన్నడ నటుడు తన ఇంటిలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆయన కన్నడ చిత్రపరిశ్రమలో ఉన్న ఓ నటిని ప్రేమించాడట! ఆ ప్రేమని సదరు హీరోయిన్ ఇంటివారు ఒప్పుకోకపోవడంతో వీరి వివాహం ఆగిపోయింది.
ఈ తరుణంలోనే ఆయన ఫినాయిల్ తాగడం, తాగిన తరువాత తానే మీడియాకి, స్నేహితులకి సమాచారం ఇవ్వడం గమనార్హం. అయితే ఈ ఘటన తరువాత ఈయనను ఆసుపత్రికి తరలించారు, అక్కడ కూడా ఈయన అందరిని తిట్టడం లాంటివి చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇలాంటి ప్రవర్తనతో ఆయన ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.