ప్రతిరోజూ పండగే తరవాత మారుతి సినిమా ఎవరితో? అనే విషయంలో గందరగోళానికి తెర పడింది. మారుతి సినిమా గోపీచంద్ తోనే. ఇది ఫిక్స్. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెరైటీగా విడుదల చేశారు.
ఈ పుకార్లపై కోర్టు వారు స్పందించినట్టు, మారుతిని నిర్దోషిగా పేర్కొంటూ.. జడ్జి తీర్పు ఇచ్చినట్టూ ఓ వీడియో విడుదల చేశారు. దీనికి రావు రమేష్ వాయిస్ ఓవర్ అందించారు. ఫస్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ ఒకే సారి విడుదల చేయబోతున్నాడు. బహుశా.. సంక్రాంతికి ఈ కబురు వినవొచ్చు. ఈ చిత్రానికి `పక్కా కమర్షియల్` అనే పేరు పెట్టారని సమాచారం. అదే ఉంటుందా? లేదంటే మారుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.