వెండి తెరపై సూపర్ హిట్ జోడీ.. నాగచైతన్య - సమంత. వీరిద్దరూ... సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు... అదో మ్యాజిక్ అయిపోతుంది. ఏం మాయ చేశావె, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ... ఇలా ఏ సినిమాలో అయినా వీళ్ల కెమిస్ట్రీ అదుర్స్. నిజ జీవితంలోనూ వీళ్లది సూపర్ హిట్ జోడీనే. తాజాగా.. మరోసారి వీరిద్దరినీ కలిసి చూసే అవకాశం దక్కింది `థ్యాంక్స్`తో. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నాగచైతన్య హీరో. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం ముందు నుంచీ సమంతనే అనుకుంటున్నారు. సమంత కూడా దాదాపు ఫిక్స్. కానీ చివరి క్షణంలో సమంత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
సమంత చేతిలో ఇప్పుడ చాలా సినిమాలున్నాయి. అటు తమిళంలోనూ ఓ సినిమా ఒప్పుకుంది. గుణశేఖర్ `శాకుంతలమ్`లో నటిస్తోంది. ఆహా కి టాక్ షో నిర్వహిస్తోంది. ఇటు కెరీర్, అటు సంసారం.. రెండూ చూసుకోవాల్సిన బాధ్యత సమంత పై పడింది. ఆ బిజీలో... ఈ సినిమా వదులుకుందని టాక్. విక్రమ్ కె.కుమార్ చివరి క్షణాల వరకూ సమంతనే కావాలని పట్టుబట్టాడని, కానీ.. వీలు కాలేదని తెలుస్తోంది. కనీసం ఓ గెస్ట్ రోల్ లో అయినా సమంత కనిపిస్తే అభిమానులకు పండగే.