గోపీచంద్‌తో రెండోసారి రెడీ!

By iQlikMovies - September 19, 2019 - 11:15 AM IST

మరిన్ని వార్తలు

ఏమైంది ఈవేళ తో ఆక‌ట్టుకున్నాడు సంప‌త్‌నంది. ర‌చ్చ‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాల‌తో మాస్‌ని మెప్పించారు. ఇప్పుడు గోపీచంద్ కోసం ఓ క‌థ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి శ్రీ‌నివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. గోపీచంద్ - సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు`గౌత‌మ్ నంద‌` అనే సినిమా వ‌చ్చింది.

 

బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రైన ఫ‌లితం రాలేదు. అయితే సంప‌త్ మేకింగ్ స్టైల్ న‌చ్చి, గోపీచంద్ మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం గోపీచంద్ `చాణ‌క్య‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ద‌స‌రాకి విడుద‌ల కానుంది. ఆ వెంట‌నే సంప‌త్‌నంది సినిమా ప‌ట్టాలెక్క‌వ‌చ్చు. ప్ర‌స్తుతం క‌థానాయిక ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS