గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆక్సిజన్'. ఎ.ఎం.జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇయర్ ఎండింగ్‌లో డిశంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే టైటిల్‌కీ, సినిమాకీ ఎలాంటి సంబంధం ఉన్నట్లుగా కనపించడం లేదనీ ఆడియన్స్ భ్రమపడే అవకాశాలు లేకపోలేదు. కానీ సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో తెలుస్తుందంటున్నాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.
గోపీచంద్ అంటే యాక్షన్ ఘట్టాలకు పెట్టింది పేరు. అందుకే ఈ సినిమాలో ఏకంగా ఏడు యాక్షన్ సన్నివేశాలున్నాయట. ఏడూ ఒకదానికి మించినవి ఒకటిగా ఉంటాయట. అంతేకాదు ఈ సినిమాకి హీరోగా ఏరి కోరి గోపీచంద్‌నే ఎంచుకోవడానికి కారణం ఈ సన్నివేశాలేనట. అంతేకాదు నటన పరంగానూ గోపీచంద్‌కి 'ఆక్సిజన్' మంచి సినిమా అవుతుందట. ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో గోపీచంద్ కనిపిస్తాడట. ఇటీవల వచ్చిన 'గౌతమ్ నందా' సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. అందులో ఒకటి పూర్తిగా నెగిటివ్ రోల్.
కాగా ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ ఏంటో తెరపైనే చూడాలంటున్నాడు డైరెక్టర్. సినిమాలోని ప్రతీ సన్నివేశం చాలా ఆశక్తికరంగా ఉంటుందట. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెెక్కింది. షూటింగ్ ఆలస్యమైనా కానీ ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందట. సినిమా అన్ని వర్గాల వారినీ ఖచ్చితంగా ఆకట్టుకునే సినిమా అవుతుందని డైరెక్టర్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా బాణీలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరికీ సినిమాలో గ్లామర్‌తో పాటు, నటనకీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట.