రష్మి, సుధీర్‌ అలా క్యాష్‌ చేసుకుంటున్నారు

By iQlikMovies - March 21, 2018 - 07:00 AM IST

మరిన్ని వార్తలు

మామూలుగా సెలబ్రిటీలకు ఎఫైర్‌ గాసిప్స్‌ అంటేనే చాలా భయం. కానీ, బుల్లితెర సెలబ్రిటీస్‌ రష్మి, సుధీర్‌ అలా కాదు, గాసిప్స్‌ని మేగ్జిమమ్‌ ఎంజాయ్‌ చేసేస్తుంటారు. రష్మి, సుధీర్‌ మధ్య ఎఫైర్‌ వుందట అనే గాసిప్‌ చాలా పాతదే. ఆన్‌ స్క్రీన్‌ ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుంటుంది. ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ విషయంలో రష్మి టాప్‌ అంతే. కో-హోస్ట్‌ ఎవరయినాసరే, చాలా రొమాంటిక్‌గా ఆ షోని నడిపేస్తుంటుందామె. 

సినిమాల్లో ట్రై చేసినా, ఇక్కడ పెద్దగా వర్కవుట్‌ కాకపోవడంతో, బుల్లితెరపై తన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడానికి రష్మి ఏం చేయాలో అంతా చేసేస్తుంటుంది. రష్మి - సుధీర్‌ కాంబోకి బుల్లితెర ఫ్యాన్స్‌ చాలా ఎక్కువ. అందుకే, వారిని దృష్టిలో పెట్టుకునే, ఇద్దరి మధ్యా 'స్కిట్స్‌' ప్రిపేర్‌ అవుతుంటాయి. ఏ ప్రోగ్రామ్‌లో ఈ ఇద్దరు కన్పించినాసరే, కాస్తంత రొమాంటిక్‌ టచ్‌, అంతలోనే ఛీత్కారాలు - ఇదంతా ఓ నాటీ గేమ్‌లా అన్పిస్తుంటుంది. 'గాసిప్స్‌ వినీ వినీ బోర్‌ కొట్టేసింది' అని రష్మి, ఇలాంటి గాసిప్స్‌ని చాలా లైట్‌ తీసుకుంటోంది. లేటెస్ట్‌గా కూడా ఇదే మాట చెప్పింది. 

సుధీర్‌ నాకు మంచి స్నేహితుడు. అతనొక్కడే కాదు, 'జబర్‌దస్త్‌' టీమ్‌లో చాలామందితో స్నేహంగా వుంటాను. మాదంతా ఓ ఫ్యామిలీ. ఇందులో 'లవ్‌' అన్న మాటకు తావు లేదు. షోలో ఏం చేసినా, అది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమేనని రష్మి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఉగాది స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో రష్మీ, పెళ్ళి చూపుల సందర్భంగా సుధీర్‌ కోసం ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ కిల్లింగ్‌ అంతే. బుల్లితెరపై అదరహో అన్పిస్తోన్న ఈ బ్యూటీని, వెండితెరపై ఆ స్థాయిలో ఎందుకు అంత రొమాంటిక్‌గా చూపించలేకపోతున్నారో ఏమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS