గోపీచంద్ 'పంతం' విడుదల ఎప్పుడో తెలుసా?

By iQlikMovies - April 09, 2018 - 11:26 AM IST

మరిన్ని వార్తలు

`ఆంధ్రుడు`, `య‌జ్ఞం`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. `ఫ‌ర్ ఎ కాస్‌` ఉప శీర్షిక‌. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఈ సినిమాను జూలై 5న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 

అయితే వివిధ మాధ్య‌మాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ప‌లు ర‌కాల వార్త‌లు వ‌స్తుండ‌టంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌తినిధి స్పందించారు..``మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా `పంతం` అనుకున్న ప్రణాళిక ప్రకారం తెర‌కెక్కుతోంది. మంచి మెసేజ్‌, క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమాగా మంచి అవుట్‌పుట్ వ‌స్తుంది. ఈ సినిమాను జూలై 5న విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. ప్ర‌స్తుతం చిత్ర నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌గారు విదేశాల్లో ఉన్నారు. ఆయ‌న ఇక్క‌డ‌కు రాగానే మీడియా స‌మ‌క్షంలో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారు. అప్ప‌టి వ‌ర‌కు సినిమా విడుద‌ల తేదీపై ఏ వార్త‌ల‌ను న‌మ్మవ‌ద్దు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే..హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని స్టైలిష్ లుక్‌లో గోపీచంద్‌గారు క‌న‌ప‌డ‌తారు. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే మెహ‌రీన్ చాలా మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. గోపీ సుంద‌ర్ సంగీతం, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌పీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయ`ని తెలిపారు.

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS