సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని నరేష్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే నరేష్, పవిత్రల పెళ్ళి జరగబోతోంది. అయితే ఈ పెళ్లి కథలో ఓ ట్విస్ట్ వచ్చింది. నరేష్ పెళ్లి జరగనివ్వనని.. మాజీ భార్య రమ్య ఇప్పుడు ముందుకొచ్చారు. రమ్యతో నరేష్‌కి ఇది వరకే వివాహమైంది. వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇప్పటి వరకూ రమ్య - నరేష్ విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడం చట్ట రీత్యా నేరం. ఇదే పాయింట్ పై.. నరేష్ పై మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
''నరేష్ నా భర్త. ఆయనకు నేనింకా విడాకులు ఇవ్వలేదు. ఇవ్వదలచుకోలేదు. నా భర్తతో కలిసే ఉంటానని మా బాబుకి మాట ఇచ్చాను. నరేష్‌ని నేను ప్రేమించి పెళ్లి చేసుకొన్నా. అయితే ఆయన ఎలాంటి వాడో ఆ తరవాత తెలిసింది. ఆయనకు చాలామంది తో సంబంధాలు ఉన్నాయి. సమ్మోహనం సినిమాతో.. పవిత్రతో పరిచయం ఏర్పడింది. మా ఇంటికి కూడా తీసుకొచ్చాడు. ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. అది సినిమా ప్రమోషన్ కోసమని భావించా. కానీ నిజంగా పెళ్లి చేసుకొంటే.. మాత్రం కోర్టుకి ఎక్కుతా.. నరేష్ కి చట్ట రీత్యా నేనే భార్యను'' అని రమ్య చెప్పుకొచ్చారు. నరేష్ వ్యవహారంపై ఆమె న్యాయ నిపుణుల సలహా తీసుకొంటున్నారు. రమ్యకి విడాకులు ఇవ్వని మాట నిజమే అయితే... నరేష్ - పవిత్రల పెళ్లికి బ్రేకులు పడినట్టే.