గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ పైన ఇప్పుడు కొత్త పుకార్లు మొదలయ్యాయి.
ఆ పుకార్ల సారంశమేమిటంటే- మెహ్రీన్ తాజాగా ఒక చిత్రంలో నటించడానికి సుమారు రూ 1 కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు అలాగే రోజువారి ఖర్చులకి కూడా కొంత మొత్తం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసిందట. దీనితో సదరు నిర్మాతలు ఈ అమ్మడు డిమాండ్స్ కి తలపట్టుకున్నట్టు సమాచారం.
అయితే ఇటువంటి డిమాండ్స్ కెరీర్ తొలినాళ్ళలోనే చేస్తే భవిష్యత్తుని అంధకారం చేసుకున్నట్టే అని ఇండస్ట్రీలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలు విన్న వారు మెహ్రీన్ అంత మొత్తంలో డిమాండ్స్ చేయకుండా ఉండాల్సింది అంటున్న వారు కూడా లేకపోలేదు.
ఈ వార్తల్లో నిజమైతే మెహ్రీన్ తన రెమ్యునరేషన్ పట్ల కాస్త పట్టువిడుపుగా ఉంటేనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయగలదు అని చెప్పగలం.