'సాహో' శ్రద్దా కపూర్‌ ఈ గాసిప్‌లో నిజమెంత?

మరిన్ని వార్తలు

యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ 'సాహో'. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రబాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ముందుగా అనుకున్న సబ్జెక్ట్‌ కంటే, ఈ సినిమాలో చాలా ఛేంజెస్‌ చేశారు. అందులో ముఖ్యంగా హీరోయిన్‌ రోల్‌నే ఎక్కువగా ఛేంజ్‌ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్దా క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా తీర్చి దిద్దనున్నారట. ముఖ్యంగా శ్రద్దాని ఓ యాక్షన్‌ గాళ్‌గా చూపించనున్నారట. అలాగే హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన సన్నివేశాలను కూడా హైలైట్‌గా తెరకెక్కించనున్నారట.

గతంలో బాలీవుడ్‌లో జాకీష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కిన 'బాఘీ' చిత్రంలో హీరోతో పాటు శ్రద్దా కపూర్‌ కూడా యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేసింది. ఆ సినిమాలో అమ్మడి యాక్షన్‌ టాలెంట్‌ చూసే ఈ సినిమా కోసం శ్రద్దాని హీరోయిన్‌గా ఎంచుకోవడం జరిగింది చిత్ర యూనిట్‌. అయితే 'బాఘీ'లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసిన అనుభవంతో శ్రద్దా కపూర్‌ ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ని చాలా సింపుల్‌గా చేసేస్తోందట. ఎంత కష్టమైన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ అయినా శ్రద్దాకి అస్సలు కష్టమనిపించడం లేదట.

సాధారణంగా హాలీవుడ్‌ సినిమాల్లోనే హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌కి ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. బాలీవుడ్‌లోనూ ఇంచుమించుగా అదే ట్రెండ్‌ ఫాలో చేస్తారు. ఇప్పుడు ఆ స్థాయిలో 'సాహో' చిత్రంలోని హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ని బిల్డప్‌ చేస్తున్నారట. 'రన్‌ రాజా రన్‌' చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ 'సాహో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS