'ఫిదా' చిత్రంతో అందరి మనసులు కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తాజాగా సాయి పల్లవి శర్వానంద్‌తో 'పడి పడి లేచె మనసు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాని దసరాకి విడుదల చేసేలా చిత్రయూనిట్ సన్నాహాలు మొదలెట్టింది. కానీ లాస్ట్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ ఉండిపోవడంతో, అది నేపాల్‌లో చిత్రీకరణ జరిపాల్సి ఉండగా, రిలీజ్ డేట్‌ని కాస్త వెనక్కి పంపించారు.
తాజాగా డిశంబర్ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్ర యూనిట్ ఆఫీషియల్‌గా వెల్లడించింది. ఈ సినిమాలో కమెడియన్ కమ్ హీరో సునీల్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సంగతిటుంచితే, సాయి పల్లవి విషయానికి వస్తే, తాను నటించిన ప్రతీ సినిమాతోనూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఇబ్బంది పడుతోంది. తొలి సినిమా 'ఫిదా'తో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో, తర్వాతి నుండి అంత ఎక్కువగా కాంట్రవర్సీలకు చోటిస్తూ వస్తోంది.
'మిడిల్‌క్లాస్ అబ్బాయి' టైంలో నానితో గొడవ అంటూ, 'కణం' చిత్రంతో నాగశౌర్యతో వివాదాలంటూ ఇలా ఏదో ఒక రకంగా సాయి పల్లవి చుట్టూ వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. ఆ వివాదాల సెగ ఇప్పుడీ తాజా మూవీకి కూడా పాకింది. హీరో శర్వానంద్‌తో సాయి పల్లవికి గొడవలున్నాయంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఇలా తన ప్రతీ కోస్టార్‌తోనూ గొడవలు పెట్టుకుంటోందనే డ్యామేజ్ సాయి పల్లవిని కెరీర్‌కి పెద్ద మచ్చ తెచ్చిపెట్టేలానే ఉంది.
వీటిన్నింటికీ చెక్ పెట్టేలా సాయి పల్లవి ఓ ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే తప్పదు. వీలైనంత తొందరగా ఈ గాసిప్స్ విషయంలో సాయి పల్లవి ఓ నిర్ణయానికి వస్తే బావుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.