పాయల్ రాజ్ పుత్- RX 100 సినిమాతో తెలుగుచిత్ర పరిశ్రమలో సంచలన ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.
ఇక ఆ చిత్రంలో గ్లామర్ తో పాటుగా యాక్షన్ పరంగా కూడా మంచి మార్కులు వేయించుకున్న పాయల్ కి ఇప్పుడు ఒక యంగ్ హీరో సరసన నటించే అవకాశం చేజిక్కించుకుంది. ఆ యంగ్ హీరో ఎవరంటే- బెల్లంకొండ శ్రీనివాస్. .
బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ కి రెండవ హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తున్నది. ఇప్పటికే తేజ-బెల్లంకొండ కలయికలో వస్తున్న సినిమా పైన అంచానాలు ఉండగా తన తొలి సినిమాతోనే ఇంతటి ఫేం సంపాదించిన పాయల్ కూడా ఈ చిత్రంలో ఉండడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది.
మరి కెరీర్ తొలి నాళ్ళలోనే వచ్చిన ఇంతటి మంచి అవకాశం ఉపయోగించుకుంటుందో లేదో అనేది చూడాలి.