మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్ళి పీటలెక్కబోతోందంటూ ఓ గాసిప్ తెగ షికార్లు చేసేస్తోంది. అయితే తమన్నా ఇంతవరకు ఈ గాసిప్‌పై స్పందించలేదు. ప్రస్తుతం తమన్నా తెలుగులో 'ఎఫ్2' సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ పిర్జాదా మరో హీరోయిన్. సినిమా షూటింగ్‌కి సంబంధించి తన షెడ్యూల్‌ని ఇటీవలే పూర్తి చేసుకుంది తమన్నా.
కాబోయే వరుడితో విదేశాల్లో తమన్నా చక్కర్లు కొడ్తోందనీ, ముంబైలో అత్యంత సన్నిహితులకి మాత్రమే తమన్నా తనకు కాబోయే భర్తను పరిచయం చేసిందనీ తెలుస్తోంది. అయితే ఇదంతా ఉత్తదేనని మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, తమన్నాకి కాబోయే భర్త ఓ డాక్టర్ అట. పైగా అతను విదేశాల్లో సెటిలయ్యాడట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా తమన్నాకి ఆమెకు కాబోయే భర్త పరిచయమయ్యాడని తెలుస్తోంది.
పెళ్ళయ్యాక తమన్నా తిరిగి సినిమాల్లో నటిస్తుందా? లేదా? అంటే, అంత తొందర వద్దు.. అసలు ఈ విషయమై ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాది తర్వాత, అదీ కాకపోతే రెండేళ్ళ తర్వాత అయినా తమన్నా పెళ్ళి పీటలెక్కాలి కదా.! ఈ మధ్యనే తమన్నా 'నా నువ్వే' సినిమాలో తమన్నా కన్పించింది. ఆ సినిమా పెద్దగా ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయిందిగానీ, తమన్నా మాత్రం ఫ్రెష్ లుక్‌తో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అదే మిల్కీ బ్యూటీ గ్లామర్ సీక్రెట్.
తమన్నా తెలుగులో చేస్తోన్న మరో సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో ఓ కీలక పాత్రలో తమన్నా కన్పించబోతోంది.