బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. అన్నీ విజయవంతమవట్లేదుగానీ, ఆ కంటెంట్‌కి గిరాకీ అయితే తగ్గడంలేదు. అడల్ట్ కంటెంట్ చుట్టూ హర్రర్ లేదా కామెడీని జోడించడం ద్వారా కొందరు విజయాల్ని అందుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళను కొల్లగొట్టడానికి ఇదొక చీప్ ట్రిక్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఏం చేసయినా, కమర్షియల్ హిట్ కొట్టడమే లక్ష్యంగా ఇలాంటి సినిమాలు రూపొందుతున్నాయి.
'క్యా సూపర్ కూల్ హై హమ్' అలాంటిదే. పచ్చి బూతు ఈ సినిమాలో కనిపిస్తుంటుంది. దాన్ని కామెడీగా చెప్పారంతే. అలాంటిదే తమిళంలో ఓ సినిమా రాబోతోంది. ఇదులో అడల్ట్ కంటెంట్‌కి కామెడీ, హర్రర్ - ఈ రెండూ మిక్స్ చేసేశారు. గౌతమ్ కార్తీక్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సినిమా పేరు 'ఇరట్టు అరయల్ మురట్టు కుత్తు'. పి.జయకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సినిమా ప్రోమో వివాదాస్పదమవడానికి కారణం ఇందులో చూపించిన కంటెంటే.
హీరోయిన్ 'హాట్ ప్రాపర్టీస్' మీద హీరో చేతులు వేయడం సహా చాలా ఛండాలం ఇందులో కనిపిస్తుంది. డబుల్ మీనింగ్ అనాల్సిన పనిలేదు, స్ట్రెయిట్‌గానే బూతు కనిపించేలా సన్నివేశాల్ని చిత్రీకరించారు. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత దారుణంగా ఉంటుందోగానీ, దర్శకుడు విజయ్‌కుమార్‌కి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. అందుకే తాను తీసింది పోర్న్ సినిమా కాదంటూ వివరణ ఇచ్చుకుంటున్నాడు. పోర్న్ సినిమాలతో సమస్యలు మామూలే, ఇలాంటి చెత్త కామెడీ, అడల్ట్ కామెడీ, వల్గర్ కామెడీ, వల్గర్ హర్రర్‌తోనే ఇంకా ఎక్కువగా సమస్యలొస్తాయ్.